అయ్యప్ప నీ మాలవేసుకున్నాను - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🕉️ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా 🕉️

13. అయ్యప్ప ...
॥ పల్లవి ॥
అయ్యప్ప నీ మాలవేసుకున్నాను
అయ్యప్ప నీ దీక్షలోన ఉన్నాను
మణికంఠ నా మనసందు నిన్నే నిలిపాను
శబరిగిరీశా నీ శరణం నిరతం పలికాను
స్వామి అయ్యప్ప ....
స్వామి శరణం అయ్యప్ప ...
॥ చరణం ౧ ॥
నీలిమలవాసా నియమం తప్పక పాలనచేస్తున్నాను
నిష్ఠతో స్వామీ ఇరుసంధ్యలో నిను పూజిస్తున్నాను
తప్పొప్పులు ఉంటే దేవా దయతో మన్నించు
దండించాలనిపిస్తే నీ దాసుని దండించు
స్వామి అయ్యప్ప ....
స్వామి శరణం అయ్యప్ప ...
॥ చరణం ౨ ॥
కలియుగదేవా కరిమలవాసా నీ కరుణే కోరాను
భక్తవిధేయ భజియించాలని నీ భక్తునిగా మారాను
అయిదుకొండలవాడా నీ అభయం అందించు
నాలోని ఆరుశత్రువులను అంతమొందించు
స్వామి అయ్యప్ప ....
స్వామి శరణం అయ్యప్ప ...
॥ చరణం ౩ ॥
శరణాగతవత్సల శంభుకుమార నీ శరణం పాడాను
చిన్ముద్రధారి శ్రీ చిద్విలాసా నీ చరణం వేడాను
ఇరుముడిప్రియుడా నాతో నీ ఇరుముడి కట్టించు
పదునెట్టాంబడివాసా నీ పడు లే ఎక్కించు
స్వామి అయ్యప్ప ....
స్వామి శరణం అయ్యప్ప ...
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow