🕉️ కొండా పుట్టిందిగాని కొండా పెరిగిందిగాని 🕉️
─── అయ్యప్ప జనపద గీతం ───
కొండా పుట్టిందిగాని కొండా పెరిగిందిగాని
కొండలో వున్నాడు అయ్యప్పా
కొండశిఖరాన వున్నాడు అయ్యప్పా
ఎంతా చక్కని స్వామి అయ్యప్పా
హరిహర పుత్రుడు అయ్యప్పా
కొండలో వున్నాడు అయ్యప్పా
కొండశిఖరాన వున్నాడు అయ్యప్పా
ఎంతా చక్కని స్వామి అయ్యప్పా
హరిహర పుత్రుడు అయ్యప్పా
॥ చరణం ౧ ॥
తూర్పు దేశాన తూర్పు దేశానతుమ్మీ పూలతోటి ఆడుతూ వున్నాడు అయ్యప్ప
ఆడిపాడుతూ వున్నాడు అయ్యప్పా
ఎంతా చక్కని స్వామి అయ్యప్పా
హరిహర పుత్రుడు అయ్యప్పా
॥ చరణం ౨ ॥
పడమటా దేశాన పడమటా దేశానపాలు నీళ్ళలోన ఆడుతూ వున్నాడు అయ్యప్ప
ఆడిపాడుతూ వున్నాడు అయ్యప్పా
ఎంతా చక్కని స్వామి అయ్యప్పా
హరిహర పుత్రుడు అయ్యప్పా
॥ చరణం ౩ ॥
ఉత్తరా దేశాన ఉత్తరా దేశానఉమ్మీ పూలతోటి ఆడుతూ వున్నాడు అయ్యప్ప
ఆడిపాడుతూ వున్నాడు అయ్యప్పా
ఎంతా చక్కని స్వామి అయ్యప్పా
హరిహర పుత్రుడు అయ్యప్పా
॥ చరణం ౪ ॥
దక్షిణా దేశాన దక్షిణా దేశాన దానిమ్మ తోటలోనఆడుతూ వున్నాడు అయ్యప్ప
ఆడిపాడుతూ వున్నాడు అయ్యప్పా
ఎంతా చక్కని స్వామి అయ్యప్పా
హరిహర పుత్రుడు అయ్యప్పా
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️