పల్లవి: అయ్యప్ప శరణం స్వామి శరణం
అయ్యప్ప శరణం స్వామి శరణం, శరణం శరణం అయ్యప్ప...
వృశ్చికంలో మాలలైకుల్ - శబరిమల జాఏగుం...
మకరంలో మణికంటూ - మనసెల్లా పులివాగుం...
వృశ్చికమే శబరిమలై యాత్రలకు ఆరంభం...
మకరంలో సంక్రాంతి జ్యోతికమే శుభతరుణం....
|| అయ్యప్ప శరణం ||
1) బాల్యంలో మాలలు వేస్తే భగవంతుడు తానేనంట
తనవారికి తానేనంట అయ్యప్ప - అయ్యప్పా
మనసంతా లగ్నము చేసి, మండలము మహిమలు చేస్తే
తన ఇల్లు కోవెల చేస్తాడయ్యప్పా - అయ్యప్పా
అసత్య దోషాలు ఆనంద బాష్పాలు
భరించు దోషాలు, తరించు జన్మాలు ఓ ఓ ఓ...
|| అయ్యప్పా శరణం ||
2) ముమ్మారు మాలలు వేస్తే, గుణబుద్ధి అవలంబిస్తే
గురువయ్యెను తానేనంట అయ్యప్ప - అయ్యప్పా
సన్యాసం త్యాగం చేసి, బంధాలను విడనాడి
మోక్షానికి తాడేవేస్తాడయ్యప్పా - అయ్యప్పా
జయించు కామాలు, జయించు మోహాలు
జయించు దోషాలు, జయించు జన్మాలు ఓ ఓ ఓ...
|| అయ్యప్పా శరణం ||
స్వామియే శరణం అయ్యప్పా 🙏