🪔 అయ్యప్ప భజన 🪔
అయ్యా అని పిలిచినా
అప్పా అని కొలిచినా
✦ ───── 🕉️ ───── ✦
అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా
అభయమిచ్చి బ్రోచేది అయ్యప్పయే
అండగా నిలిచేది ఆ తండ్రియే
అభయమిచ్చి బ్రోచేది అయ్యప్పయే
అండగా నిలిచేది ఆ తండ్రియే
॥ అయ్యా ॥
శివకేశవ రూపమైన మోహిని పుత్రుని
పంబానది తీరాన వెలసిన బాలుని
పంబానది తీరాన వెలసిన బాలుని
॥ అయ్యా ॥
పులిపాలను తెచ్చిన పొన్నంబల వాసుని
తల్లి మనసు మార్చిన శబరిగిరి నాధుని
తల్లి మనసు మార్చిన శబరిగిరి నాధుని
॥ అయ్యా ॥
మంజుమాత వలచిన మోహనరూపున
కాంతమల జ్యోతిగా వెలుగొందు స్వామిని
కాంతమల జ్యోతిగా వెలుగొందు స్వామిని
॥ అయ్యా ॥
అజ్ఞానపు పొరలను తొలిగించే దేవుని
అందరినీ ప్రేమ మీర కరుణించే మూర్తివి
అందరినీ ప్రేమ మీర కరుణించే మూర్తివి
॥ అయ్యా ॥
🪔 అయ్యా... అయ్యప్పా 🪔
శరణం కోరే భక్తులందరికీ
అభయమిచ్చే స్వామివే
అభయమిచ్చే స్వామివే
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏