🕉️ అభిషేకము చేద్దము రారండి 🕉️
─── అయ్యప్ప అభిషేక గీతం ───
అభిషేకము చేద్దము రారండి మన అయ్యప్పస్వామికి
అభిషేకము చేద్దము రారండి (2)
అభిషేకము చేద్దము రారండి (2)
॥ పాలాభిషేకం ॥
గోవుల మందకు మనమే వెళ్ళిగోమాత పాలను తీసుకువచ్చి (2)
స్వామి వారికి పాలాభిషేకం
చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పుణ్యము
॥ అభిషేకము ॥
॥ దద్యాభిషేకం ॥
గోవు పాలను తీసుకువచ్చిగోవుపాలనే పెరుగుగా మలచి
స్వామి వారికి దద్యాభిషేకం
చేసిన జన్మ ధన్యము చేసిన వారికి పుణ్యము
॥ అభిషేకము ॥
॥ నెయ్యాభిషేకం ॥
గోమాత పెరుగును తీసుకువచ్చిగోమాత పెరుగునే నెయ్యిగా మలచి
స్వామి వారికి నెయ్యాభిషేకం
చేసిన జన్మ ధన్యము చేసిన వారికి పుణ్యము
॥ అభిషేకము ॥
॥ తేనాభిషేకం ॥
చెట్టు పుట్టలు మనమే తిరిగిపుట్ట తేనెనే తీసుకువచ్చి
స్వామి వారికి తేనాభిషేకం
చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పుణ్యము
॥ అభిషేకము ॥
॥ చక్కెరాభిషేకం ॥
చెరకు తోటకు మనమే వెళ్ళిచెరకు గడలను తీసుకువచ్చి
చెరకు గడలను చెక్కెరగా మలచి
స్వామి వారికి చక్కెరాభిషేకం
చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పుణ్యము
॥ అభిషేకము ॥
॥ పండాభిషేకం ॥
పండ్ల తోటకు మనమే వెళ్ళిరకరకాల పండ్లను తెచ్చి
స్వామి వారికి పండాభిషేకం
చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పుణ్యము
॥ అభిషేకము ॥
॥ పలోదక స్నానం ॥
కొబ్బరి వనమునకు మనమే వెళ్ళినారికేళము తీసుకువచ్చి
స్వామి వారికి పలోదక స్నానం
చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పుణ్యము
॥ అభిషేకము ॥
🕉️ సిరిసిరి మువ్వల అయ్యప్పా 🕉️
మా చిన్నారి నవ్వుల అయ్యప్పా
వీరాధి వీరుడవు అయ్యప్పా
వీరమణికంఠుడవు అయ్యప్పా
మా చిన్నారి నవ్వుల అయ్యప్పా
వీరాధి వీరుడవు అయ్యప్పా
వీరమణికంఠుడవు అయ్యప్పా
॥ భస్మాభిషేకం ॥
ఆవు పేడతో పిడకను చేసిఆవు పిడకతో భస్మము తీసి
స్వామి వారికి భస్మాభిషేకం
చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పుణ్యము
॥ అభిషేకము ॥
॥ చందనాభిషేకం ॥
అష్టగంధ మూలిక తెచ్చిస్వామి వారికి చందనాభిషేకం
చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పుణ్యము
॥ అభిషేకము ॥
॥ కుంకుమాభిషేకం ॥
ఎర్ర చందనం తీసుకువచ్చిస్వామి వారికి కుంకుమాభిషేకం
చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పుణ్యము
॥ అభిషేకము ॥
॥ పన్నిరాభిషేకం ॥
మంచి నీటిని తీసుకువచ్చిస్వామి వారికి పన్నిరాభిషేకం
చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పుణ్యము
॥ అభిషేకము ॥
॥ శుద్ధోదక స్నానం ॥
పంబా జలము తీసుకువచ్చిస్వామి వారికి శుద్ధోదక స్నానం
చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పుణ్యము
॥ అభిషేకము ॥
॥ పుష్పాభిషేకం ॥
పూలతోటకు మనమే వెళ్ళిరకరకాల పూలను తెచ్చి (2)
స్వామి వారికి పుష్పాభిషేకం
చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పుణ్యము
॥ అభిషేకము ॥
॥ హారతి ॥
ధూపం, దీపం తీసుకు వచ్చిభక్తితోన స్వామిని తలచి
స్వామి వారికి హారతులు ఇచ్చిన జన్మ ధన్యము
చూసిన వారికి పుణ్యము
॥ అభిషేకము ॥
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️