136. దేవుడొచ్చినాడురో / Devudochinaduro - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🕉️ దేవుడొచ్చినాడురో సూడరో 🕉️

─── అయ్యప్ప ఆగమన గీతం ───
దేవుడొచ్చినాడురో సూడరో సూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా
దేవుడొచ్చినాడురో సూడరో సూడరా (2)
అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా (2)
ఓ దేవా మా దేవా మా కొసమే వచ్చినావ
స్వామి.. ఓ దేవా.. స్వామి.. మా దేవా.. స్వామి.. మా కొసమే వచ్చినావ
॥ చరణం ౧ ॥
ముక్కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాము (2)
నువ్వు ఒక్కడివే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము (2)
మనసంతా ఇప్పేసి ఎదలన్ని చెప్పేద్దాం
స్వామి .. మనసంతా ఇప్పేసి ఎదలన్ని చెప్పేద్దాం
హరిహరా తనయుడా అందరి దేవుడా
ఆపదలో ఆదుకొనే శబరిమలై నాధుడా
(దేవుడొచ్చి...)
॥ చరణం ౨ ॥
రంగు రంగు పూలు తెచ్చి హారలే వేసినాము (2)
పుట్టతేనె పాలతొటి ఫలహారము చేసినాము (2)
పాదాలే కడిగేము నీ పూజలే చేసేము (2)
గణపతి సోదరుడా జ్యోతీస్వరూపుడ
కార్తికేయ సోదురుడా కాంతిమలై వాసుడా
(దేవుడొచ్చి...)
॥ చరణం ౩ ॥
పగలంతా పనిచేసి అలసిసొలసి పోయినాము (2)
సందెవేళ కాగానే అలయంబు చేరినాము (2)
ఆడేము పాడేము ఆనందమే పొందేము
ఆడేము.. స్వామి.. పాడేము.. స్వామి.. ఆనందమే పొందేము
ఎరిమేలి వాసుడా వావరకు మిత్రుడా
కరిమలై వాసుడా పంబానది బాలుడా
(దేవుడొచ్చి...)
🕉️ దేవుడొచ్చినాడురో సూడరో సూడరా 🕉️
అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా
ఓ దేవా మా దేవా మా కొసమే వచ్చినావ
ఓ దేవా.. స్వామి.. మా దేవా.. స్వామి.. మా కొసమే వచ్చినావ
మా కొసమే వచ్చినావ...

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow