@ Pamba Teeram Maniharamto @.పంబాతీరం మణిహారంతో @ Pamba Teeram Maniharamto - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

```html
పంబాతీరం మణిహారంతో దొరికిన మణికంఠా
పందళ రాజుకు మణికంఠా
|| పంబ ||
పరి పరి విధముల పిలిచేమయ్యా రావా మణికంఠా
హరిహర తనయ మణికంఠా
|| పంబ ||
నిత్య సత్యవో దేవా నీకు నీరాజనమయ్యా
దేవా నీరాజనమయ్యా
నిర్మల రూపా నీలిమలేశా నిత్య నందమయ్యా
|| పంబ ||
ముల్లోకాలను మెప్పించిన ఓ దివ్యశక్తి మూర్తి
ఓ దివ్యశక్తి మూర్తి (2)
అండపిండ బ్రహ్మాండము నీవే కలియుగ వరదయ్యా స్వామి
|| పంబ ||
పంచగిరిశా ఓ శబరిశా స్వామి జగదీశా
ఓ స్వామి జగదీశా (2)
పరమ దయాళ పతితపావన పూర్ణ నందమయ్యా
|| పంబ ||
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️
```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow