అయ్యప్ప మాల ధారణ నియమాలు
మనం అయ్యప్ప మాలలు వేసుకునే రోజులు వచ్చేశాయి. తప్పుగా అర్థం చేసుకోకండి. నేను గ్రహించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఈ చిన్న ప్రయత్నం.
అయ్యప్ప దీక్ష నియమాలు
- మండల కాల దీక్ష 41 నుండి 48 రోజులు ఉంటుంది. అయ్యప్ప స్వామి ఆదేశానుసారం కనీసం 41 రోజులు దీక్ష చేయాలి.
- ప్రతి అయ్యప్ప భక్తుడు నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. కన్ని స్వామి అయినా, గురు స్వామి అయినా నలుపు వస్త్రాలు ధరించాలి.
- ఎరుపు వస్త్రం యాత్ర సమయంలో మాత్రమే ధరించాలి. సాధారణంగా ధరించకూడదు. మనం బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాం కాని సన్యాసంలో లేము.
- మనము చేసేది బ్రహ్మచర్య దీక్ష మాత్రమే. వనయాత్ర సమయంలో మాత్రమే ఎరుపు వస్త్రం ధరించాలి.
- గురు స్వాములు పడిపూజ సమయాలు పాటించాలి. సాధారణంగా సాయంత్రం 6:00 PM నుండి 10:00 PM వరకు నిర్వహించాలి.
- అన్న ప్రసాదంలో మసాలా దినుసులు నివారించాలి. సాత్విక ఆహారం మాత్రమే ఉండేలా చూడాలి.
- అయ్యప్ప అభిషేకం మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్వహించేలా ప్రయత్నించాలి.
- అభిషేకం కోసం ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, చెరుకు రసం వంటి పవిత్ర పదార్థాలను ఉపయోగించాలి.
- నేను గురు స్వామిని అనే భావన కాకుండా ముందుగా నేను కన్ని స్వామిని అని గుర్తించాలి.
- పవిత్రమైన అయ్యప్ప దీక్షను వ్యాపారంగా చేయకూడదు.
- పూజలు చేయడానికి అప్పులు చేయకండి. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి పూజలు నిర్వహించండి.
- కన్ని స్వాములకు నియమాలు కచ్చితంగా పాటించేలా గురు స్వాములు శిక్షణ ఇవ్వాలి.
- పవిత్రమైన బంగారు పడిమెట్లు 41 రోజుల దీక్ష తర్వాత మాత్రమే ఎక్కాలి.
- పవిత్రమైన 18 మెట్లు ఎక్కడానికి బ్రహ్మచర్య కఠోర నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
- అయ్యప్ప స్వామి దీక్ష నియమాలను ప్రతి భక్తుడు కచ్చితంగా పాటించాలి.
- మన ప్రవర్తనను చూసి ఇతరులు కూడా అయ్యప్ప మాల ధరించేలా ఆదర్శంగా ఉండాలి.
- అయ్యప్ప దీక్ష ద్వారా హిందూ సనాతన ధర్మం సంప్రదాయాలు వ్యాప్తి చెందాలి.
- ఎన్ని సార్లు శబరిమల వెళ్లామన్నది కాదు, దీక్షను పవిత్రంగా ఆచరిస్తున్నామా అన్నది ముఖ్యము.
- మన ముందు తరాలకు మార్గదర్శకులుగా ఉండాలి.
- అయ్యప్ప స్వామి దీక్ష పవిత్రతను కాపాడాలి.
- మన దీక్ష ఇతరులకు ఆదర్శంగా ఉండాలి.
- మనల్ని చూసి మరెందరో అయ్యప్ప దీక్ష తీసుకునేలా ఉండాలి.
- ఎలాంటి పరిస్థితుల్లోనైనా అయ్యప్ప స్వామి నియమాలను ఉల్లంఘించకూడదు.
- మనల్ని చూసిన ప్రతి ఒక్కరి మనసులో దీక్ష చేయాలనే భావన కలగాలి.
- మన దీక్ష నియమాలు అందంగా, ఆదర్శంగా కనిపించాలి.
- అప్పుడే మన వ్రతదీక్షకు నిజమైన విలువ ఉంటుంది.
- ఇతరులు చూడాలని కాదు, మన మంచికోసం మరియు కుటుంబ శ్రేయస్సుకోసం దీక్ష తీసుకోవాలి.
- ఇతరుల ముందు అయ్యప్ప మాల పవిత్రతను అపవిత్రం చేయకూడదు.
- మాల ధరించిన ప్రతి స్వామి మరొక స్వామికి మార్గదర్శకుడిగా ఉండాలి.
సనాతన ధర్మాన్ని కాపాడుదాం. అప్పుడు అయ్యప్ప స్వామి మనల్ని కాపాడుతాడు.
🚩 స్వామియే శరణమయ్యప్ప 🚩