శ్రీ దుర్గా దేవి
రంగు: నిండు ఎరుపు
పుష్పం: మందార
ప్రసాదం: పులగం, కదంబం
దసరా నవరాత్రులలో ఎనిమిదవ రోజు అమ్మను శ్రీ దుర్గా దేవిగా అలంకరిస్తారు. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది.
ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి. పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహదోషాలు అమ్మను పూజించినంత మాత్రాన ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.
పూజా విధానం
ఎర్రని బట్టలు పెట్టి, ఎర్రని అక్షతలతో, ఎర్రని పూలతో అమ్మని పూజించాలి.
మంత్రము: "ఓం దుం దుర్గాయై నమః"
దుర్గా సూక్తము పారాయణ చేయవలెను. దుర్గా, లలితా అష్టోత్తరములు పఠించవలెను.
నివేదన: పులగము నివేదన చేయాలి.
గాయత్రీ మంత్రం
ఓం భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రీని మించిన మంత్రం లేదు. ఈ తల్లిని మించిన దైవం లేదు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు
- వినాయకుడు – విఘ్నాలను తొలగించి బుద్ధి, జ్ఞానం ప్రసాదిస్తాడు.
- నృసింహ స్వామి – పరాక్రమం, ధైర్యం, విజయాన్ని ప్రసాదిస్తాడు.
- విష్ణుమూర్తి – సర్వజీవులను రక్షించే పాలనాశక్తి.
- ఈశ్వరుడు – ఆత్మశక్తి, కల్యాణ గుణాలను ప్రసాదిస్తాడు.
- శ్రీకృష్ణుడు – యోగశక్తి, జ్ఞానం, వైరాగ్యాన్ని ఇస్తాడు.
- రాధాదేవి – ప్రేమశక్తి, భక్తిని పెంచుతుంది.
- లక్ష్మిదేవి – ఐశ్వర్యం, సంపద ప్రసాదిస్తుంది.
- అగ్నిదేవుడు – తేజస్సు, శక్తిని ప్రసాదిస్తాడు.
- మహేంద్రుడు – రక్షణశక్తి, శత్రుభయ నివారణ.
- సరస్వతి – విద్య, జ్ఞానం ప్రసాదిస్తుంది.
- దుర్గాదేవి – దమనశక్తి, శత్రువుల నుంచి రక్షణ.
- ఆంజనేయుడు – భక్తి, నిష్ఠ, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు.
- భూదేవి – ధైర్యం, స్థిరత్వం ప్రసాదిస్తుంది.
- సూర్యుడు – ఆరోగ్యం, ప్రాణశక్తి ఇస్తాడు.
- శ్రీరాముడు – ధర్మం, శీలం, సౌమ్యతకు ప్రతీక.
- సీతాదేవి – తపశ్శక్తి, ఆధ్యాత్మికోన్నతి.
- చంద్రుడు – శాంతి, మనశ్శాంతి ప్రసాదిస్తాడు.
- యముడు – కాలశక్తి, నియమశక్తి.
- బ్రహ్మ – సృష్టిశక్తి.
- వరుణుడు – దయ, ఆనందం, కోమలత్వం.
- నారాయణుడు – నిర్మలత్వం, ఆదర్శశక్తి.
- హయగ్రీవుడు – జ్ఞానం, సాహసం.
- హంస – వివేకశక్తి.
- తులసీమాత – సేవాశక్తి, ఆత్మశాంతి.
త్రికాలాలలో గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల ఆరోగ్యం, సంకల్పబలం, ఏకాగ్రత మరియు మనశ్శాంతి కలుగుతాయని మన ఋషులు చెప్పారు.