🕉
🙏 శ్రీలక్ష్మి నీ మహిమ 🙏
గౌరమ్మ - చిత్రమై గోచెనమ్మ
శ్రీలక్ష్మి నీ మహిమలో గౌరమ్మ
చిత్రమై గోచెనమ్మ గౌరమ్మ
మహాలక్ష్మి నీ మహిమలే గౌరమ్మ
చిత్రమై గోచెనమ్మ గౌరమ్మ
1
భారతీసతివైయి! బ్రహ్మకిల్లాలివై పార్వతిదేవివై, పరమేశురాలివై
పరగ శ్రీలక్ష్మివమ్మొ గౌరమ్మ, భార్యవైతివి హరికివే గౌరమ్మ
||శ్రీలక్ష్మి
2
ఏన్నెన్నిరూపములు, ఏడేడు లోకాల వున్న జనులకు
కొంగుబంగారమై కన్నతల్లీవైతివే గౌరమ్మ కామధేనువైతివే గౌరమ్మ
||శ్రీలక్ష్మి!!
🪷 ✦ 🪷
3
ముక్కోటి దేవతలు చక్కానీకాంతలు ఏక్కూవా నీనుగుర్చి
పెక్కునోములు నోమిరి గౌరమ్మ ఈ లోకములందుండిరీ గౌరమ్మ
||శ్రీలక్ష్మి!
4
తమకంటే ఎక్కువ దైవము ఎవ్వరు లేరు తమకింపు గుర్తింప
సకలలోకంబలో క్రమముచే పలించగా గౌరమ్మ కన్నుల పండుగాయే గౌరమ్మ
||శ్రీలక్ష్మి!
🪷 ✦ 🪷
5
నిగనిగాయనేటి నగుమోముతోజూపి జగతి పున్నమినటి
చంద్రునిఒడించు సొగసైన నీతిలకమే గౌరమ్మ చూచితే అనందమే గౌరమ్మ
||శ్రీలక్ష్మి
6
రత్నాల జపమాల రాజహరంబులూ ముత్యాల పగడాలు
మణిమాణిక్యాలు దరియిస్తివే గౌరమ్మ ముద్దుమంగళసూత్రమే గౌరమ్మ
||శ్రీలక్ష్మి
🪷 ✦ 🪷
7
నల్లవరి బియ్యము మల్లె మొగ్గలవలె తెల్ల వజ్రంబులూ
ముల్లోకములనేలే తల్లినిదంతములే గౌరమ్మ దానిమ్మ బీజంబులే గౌరమ్మ
||శ్రీలక్ష్మి
8
తొమ్మిది దినమూలు నెమ్మనంబునపొంగి అమ్మలక్కలు గూడి
ఆస్తిలో తమకున్న సొమ్ములను దర్శించుగా గౌరమ్మ శోభనంబని పాడిరీ గౌరమ్మ
||శ్రీలక్ష్మి!
🪷 ✦ 🪷
9
బంగారు పువ్వులు బతకమ్మలను పేర్చి మంగళంబున నిన్ను మధ్య
నానిలిపీలి రంగు గుమ్మడి పూవులే గౌరమ్మ రాసిగాఅర్పింతుమే గౌరమ్మ
||శ్రీలక్ష్మి!
10
గట్ల పుష్పంబులూ తామరపూవులు కాలగొట్టపుపువ్వూలు గన్నెరూ | పువ్వులు లిల్లి పువ్వులు జల్లుచూ గౌరమ్మ పొగడ పువ్వులు నింపుచు గౌరమ్మ
||శ్రీలక్ష్మి!!
🪷 ✦ 🪷
11
పన్నీరు అత్తారు పచగంధంబును పరిమళంబులు బుక్క
బారైనకస్తూరి పసుపుకుంకుమ గుప్పుచు గౌరమ్మ పాటలెన్నో పాడిరీ గౌరమ్మ
||శ్రీలక్ష్మి!!
12
నూటొక్క పువ్వులు కోటినోములు నోమి నీటుగా కాంతలు
ఆటపాటలతోను మాటికి నిను మెచ్చగా గౌరమ్మ మంగళరతులు పాడిరే గౌరమ్మ
||శ్రీలక్ష్మి
🪷 ✦ 🪷
13
కోరి ఈరీతిగా కలిపూజింతురూ చారుసుందరమైన
సౌభాగ్యములనిచ్చి కారున్యములనేలవే గౌరమ్మ కల్పాయు నోసగము గౌరమ్మ
||శ్రీలక్ష్మి!!
14
పారిజాతంబూలు పగిడితంగేడి పువ్వూలు గోరింటపున్నేలు
కురువింద మల్లేలు తీరు రుద్రాక్షపూలే గౌరమ్మ పేరైన కనకాబ్రాలే గౌరమ్మ
||శ్రీలక్ష్మి
🪷 ✦ 🪷
15
పాలుమీగడలఅటు పానకంబున జున్ను పోలేలు మరిమడుగు
పూరీలుసేమియాలు మేలు చక్కెర గరిజలే గౌరమ్మ మెప్పుగా అరిపింతుమే గౌరమ్మ
||శ్రీలక్ష్మి
16
గంగనర్మద యమున కావేరి సరియు తుంగబద్రాది
ముచుకుందనది తీరమున పొంగివేడుకచేయగా గౌరమ్మ పురుషులు స్త్రీలుకూడి గౌరమ్మ
||శ్రీలక్ష్మి
🪷 ✦ 🪷
17
నూటక్కపువ్వూలు కోటినోములు నోమి నేరుగా కాంతలు
ఆటలపాటలతోటి ఘనముగా నీ పూజలే గౌరమ్మ భక్తితో మెము సేతుమే గౌరమ్మ
||శ్రీలక్ష్మి
18
పాడినావారికి పాటవినువారికి జోడుపల్లాకీలు మేలుజాతి గుజ్రాల
చూడసొంపగు గజములు గౌరమ్మ వేడుకాతోనిచ్చునూ గౌరమ్మ
||శ్రీలక్ష్మి!!
🎵 ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి 🎵
▶ పాట వినండి