అహా ఏమని వర్ణించను అయ్యప్ప స్వామి మోహనరూపం ||2||
పాల కడలినే మధనము చేయగా
అమృత కలశం పుట్టినదిరా
అమృత బాండము పంచగ శౌరి
మోహినిరూపం దాల్చినాడురా (ఆహా!)
మోహిని రూపము మోహము రేపగా
పరమేశ్వరుడే పూనినాడురా
హరిహర దేవుల పుణ్య ఫలముగా
అయ్యప్పస్వామి అవతరించేరా (ఆహా!)
గర్వ్వందురాలైన మహిషిని చంపి
ప్రజాలనెల్ల కాపాడినాడురా
బ్రహ్మచర్యమే దీక్షగా భూమి
శబరిమలైకి తరలి వెళ్లిరా (ఆహా!)
పావనమగు ఆ పంబా నదిలో
పాపాలను ప్రక్షాళన చేయగా
భక్త కోటికే ముక్తిని చూపగు
జ్యోతి రూపుడై వెలసినాడురా (ఆహా!)