లక్ష్మి గణపతి వాణీగణపతి
॥ కాణిపాకమున సిద్ధి గణపతీ ॥
పల్లవి
లక్ష్మి గణపతి వాణీగణపతి దేవా
శుభ పంబాగణపతి డూండి గణపతి నీవే
కాణిపాకమున సిద్ధి గణపతీ (2)
కన్నెమూలగణతి దేవాదిదేవా
|| లక్ష్మి ||
చరణం 1
అయ్యపాగ్రజ ఆదరింపుమా మా దీక్ష సాగనీ నిరతం సాగనీ
గిరివరసుతజాతా పురహర సంజాతా
నిన్నే తలచితి నిన్నే పిలిచితి నిన్నే కొలచితి నిన్నే పొగిడితి
నిన్నే కోరితి నిన్నే వేడితి వరదా శుభకర సుఖదా
|| లక్ష్మి ||
చరణం 2
మొదలి వేలుపా ముదల నీయరా
పోనీ ఆగ్రహం రానీ అనుగ్రహం
సతజనహిత వరదా సురగణనుతచరణా
విఘ్నాలన్నియు భగ్నం చేయర దుష్టుల చేష్టలు దూరం చేసి
లగ్నం పెట్టర శుభకార్యాలకు
భజరే గణనాథం భజ భజరే గణనాథం
|| లక్ష్మి ||
॥ శ్రీ కాణిపాక వినాయకాయ నమః ॥
॥ శ్రీ కన్నెమూల గణపతయే నమః ॥
॥ శ్రీ కన్నెమూల గణపతయే నమః ॥