శ్రీ గణ నాధా రారా
॥ ఘుకుల తిలకా రా రా పాట స్టైల్ లో ॥
పల్లవి
శ్రీకర శుభకర రారా - ఓశివుని కుమార రారా 2
శ్రీ గణ నాధా రారా - నీ శరణము కోరితి రారా 2
గజముఖ వరదా రారా - ఓ గణపతి దేవా రారా 2 మూషిక వాహన రారా - నినుముందుగ వేడెద రారా 2
గజముఖ వరదా రారా - ఓ గణపతి దేవా రారా 2 మూషిక వాహన రారా - నినుముందుగ వేడెద రారా 2
చరణం 1
సురగణ పూజిత రారా - వరసిద్ధి వినాయక రారా 2
గౌరీ తనయా రారా - విఘ్నాలను బాపగ రారా 2
చరణం 2
మల్లె మందార కలువ - జిల్లేడు గన్నేరు పూలు 2
ముదముగ మాలలు కట్టి - నీ మెడలో వేసెద రారా 2
చరణం 3
కుడుములు ఉండ్రాళ్లు స్వామి - కడుపారగ సేవించుమురా 2
కోరిన వరములనొసగి - ఓకరిముఖ త్వరగా రారా 2
చరణం 4
గణ గణ గంటలమోత - వినబడదా విఘ్న నివారా 2
ఘనముగ భజనలు చేయ - అలుకేలర అరుదెంచుమురా 2