JCL News TV
భక్తి మార్గం - ఆధ్యాత్మిక ప్రస్థానం
శివుడే దేవుడని నేనంటే
శివుడే దేవుడు కాదంటారు
శివస్మరణే చెయ్యొద్దంటారు
శివయ్యా శివయ్యా శివయ్య నీ మాయా
శివయ్యా శివయ్యా నీ మాయ తెలియదయ్యా
1
"పరమశివుడని నేనంటే" (2)
పాములాడిస్తడని నిన్నంటారు
పాములాగరడని నినంటారు
శివయ్యా శివయ్యా శివయ్య నీ మాయ
శివయ్యా శివయ్యా నాకేమి తెలియదయ్యా
"శివుడేదేవుడని"
2
"గరళకంఠుడని నేనంటే" (2)
గంగిరెద్దులోడని నిన్నంటారు
గంగిరెడ్లగాస్తడని నిన్నంటారు
శివయ్యా శివయ్యా శివయ్య నీ మాయ
శివయ్యా శివయ్యా ఎవరు తెలియరయ్యా
"శివుడేదేవుడని"
3
"కాశి విశ్వనాథుడని నేనంటే"
కాటిలోపండ్తడని నిన్నంటారు
కాటికాపలా అని నిన్నంటారు
శివయ్యా శివయ్యా శివయ్య నీ మాయ
శివయ్యా శివయ్యా ఎవరు తెలియరయ్యా
"శివుడేదేవుడని"
సనాతన ధర్మం
"పుడితే పుట్టాలి హిందువుగా
భారతదేశపు పౌరుడిగా" (2)
బలిబలి బలిబలి భజరంగీ
జైబోజైబోలో భజరంగీ
కులమతా భేదాలను వీడాలి
మనమంతా ఏకమై ఉండాలి
బలిబలి బలిబలి భజరంగీ
జైబోలోజైబోలో భజరంగీ
కరసేవకులై కదలాలి
సనాతనా ధర్మాన్ని నిలపాలి
🙏
ఓం నమః శివాయ