జ్యోతిష్యం: కార్తీకమాసం.. ఏ రాశి వారు ఏమంత్రం పఠించాలి.. ఎలాంటి ఫలితం కలుగుతుంది..!

కార్తీకమాసం - రాశి వారీగా మంత్రాలు మరియు పరిహారాలు

కార్తీకమాసం: ప్రతి రాశి వారు పఠించాల్సిన మంత్రాలు మరియు పరిహారాలు

కార్తీకమాసం రాశి ఫలాలు

కార్తీకమాసం చాలా పవిత్రమైన మాసం. ఈ నెల శివ కేశవులను ఎంతో భక్తితో పూజిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నెలలో ప్రతి రాశి వారు కొన్ని మంత్రాలను పఠించి.. కొన్ని పరిహారాలను పాటిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఏ రాశి వారు ఏ మంత్రాన్ని జపం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం...!

మేష రాశి
అధిపతి: కుజుడు
"ఓం మహాకాళాయ నమః" మరియు "ఓం నమః శివాయ"
పరమేశ్వరుని అనుగ్రహంతో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ రాశి వారు కార్తీకమాసంలో దీపదానం చేయడం వలన అన్ని సమస్యలకు పరిష్కారం కలుగుతుంది.
వృషభ రాశి
అధిపతి: శుక్రుడు
"ఓం విశ్వనాథ నమః" మరియు "ఓం నాగేశ్వరాయ నమః"
బుధవారం వినాయకుడికి గరిక సమర్పించాలి. కార్తీక సోమవారం రోజుల్లో పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేయాలి.
మిథున రాశి
అధిపతి: బుధుడు
"ఓం విష్టారి నమః"
ఈ మంత్రం జపించడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి. సోమవారం ఆవుపాలతో అభిషేకం చేయాలి మరియు అన్నదానం చేయాలి.
కర్కాటక రాశి
అధిపతి: చంద్రుడు
"ఓం చంద్రమౌళేశ్వర నమః" (108 సార్లు)
పరమేశ్వరుడితో పాటు చంద్రుడి ఆశీస్సులు కలుగుతాయి. శాంతి, శ్రేయస్సు మరియు ప్రతి విషయంలో ఆలోచించే ఙ్ఞానం కలుగుతుంది.
సింహ రాశి
అధిపతి: సూర్యుడు
"ఓం రుద్రనాథ నమః" మరియు "ఓం మహాకాళాయ నమః"
ఈ మంత్రాలను జపం చేయడం వలన ఇప్పటి వరకు ఉన్న కష్టాలు తొలగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కన్యా రాశి
అధిపతి: బుధుడు
"ఓం త్రిపురారి నమః"
సకల కార్యసిద్ధి కోసం ఈ మంత్రాన్ని పఠించాలి. దీని వలన అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.
తులా రాశి
అధిపతి: శుక్రుడు
"ఓం దిననాథ నమః" మరియు "ఓం నందీశ్వరాయ నమః"
సోమవారం చెరుకురసంతో అభిషేకం చేయాలి. పరమేశ్వరుని దీవెనలు పుష్కలంగా కలిగి అనుకున్న పనులు నెరవేరుతాయి.
వృశ్చిక రాశి
అధిపతి: కుజుడు
"ఓం మహేశ్వర నమః"
సోమవారం స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయాలి. గురువారం పేదలకు అన్నదానం, పౌర్ణమి రోజున శివాలయం అర్చకులకు స్వయంపాకం, దక్షిణ తాంబూలం ఇవ్వాలి.
ధనుస్సు రాశి
అధిపతి: గురుడు
"ఓం దేవదేవేశ్వర నమః" మరియు "ఓం నమో శివాయ గురుదేవాయ"
పరమేశ్వరుని అనుగ్రహం కలిగి కష్టాలు తొలగుతాయి.
మకర రాశి
అధిపతి: శని దేవుడు
"ఓం శివదానీ నమః"
శనివారం ఆంజనేయస్వామికి ఆకుపూజ చేయాలి. శని దేవుడికి తైలాభిషేకం చేసి బెల్లం, నువ్వులు సమర్పించాలి.
కుంభ రాశి
అధిపతి: శనీశ్వరుడు
"ఓం పటాలేశ్వర నమః"
మానసిక ప్రశాంతత కలుగుతుంది. సోమవారం పరమేశ్వరునికి అభిషేకం, శనివారం శని భగవానుడికి తైలాభిషేకం, పౌర్ణమి రోజున పేదలకు అన్నదానం మరియు బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి.
మీన రాశి
అధిపతి: గురుడు
"ఓం మహాదేవ నమః" లేదా "ఓం గురు దేవాయ నమః" (108 సార్లు)
పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. గురువారం దక్షిణామూర్తి స్తోత్రం పఠించాలి మరియు పేదలకు ధనసహాయం చేయండి.
గమనిక (Disclaimer): పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow