@ ఓరోరి గణపతి రా నీ బొజ్జ నిండా వుండ్రాలు పోసేమురా @ వినాయక భజన పాటల లిరిక్స్

ఓరోరి గణపతి రా
నీ బొజ్జ నిండా వుండ్రాలు పోసేమురా
ఎలుక వాహనము నెక్కి కులుకూతూ వచ్చి నీవు కుడుమూ లుండ్రాలు మెక్కి ఇడుములా బాపి పోరా
||ఓరోరి గణపతి రా||
అరటి దానిమ్మ పళ్ళు వెలగ మారేడు పళ్ళు అల్లో నేరేడు పళ్ళు ఆరాగించంగా రారా
||ఓరోరి గణపతి రా||
పులిహోర పొంగళ్ళు పప్పు నెయ్యి దప్పడాలు పంచా భక్షాలు ఆరాగించి పోదువు రారా
|| ఓరోరి గణపతి రా||
గరికా పరకాలు బెడితే పరమానందము నీకు చెరుకు ముక్కాలు బేడితే చెప్పిదేమున్నాది ఇంకా
||ఓరోరి గణపతి రా||
పిలుపులనందుకొని చెలువారా వచ్చినీవు కాలువాలా పూజాలంది కలుమూల నిచ్చిపోరా
||ఓరోరి గణపతి రా||
పందా దారా విల్లు పంచ పూల బాణాలు పాశాంకుశాలు బట్టి కంచి గణపతి రారా
||ఓరోరి గణపతి రా||
ఎల్లా లోకాలు నెలే ఏకైక సామివి నీవు ఎల్లా వేళాల మమ్ము చల్లంగా చూడ రారా
|| ఓరోరి గణపతి రా||
వెండి కొండయ్య కూతురి బంగారు కొండావంటా నిండుగా నూ కొలువుంటే పండు బంగారు పంట
||ఓరోరి గణపతిరా||

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow