చల్లని ఓ చిరుగాలి – అయ్యప్ప భక్తి గీతం
చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే,
కిల కిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే.
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (2)
చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే,

స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం
ముత్యాల నా తండ్రి, రతనాల నా తండ్రి,
విరుమిట్లు కొలిపేటి వజ్రాల నా తండ్రి.
పగడాల నా తండ్రి, మువ్వల నా తండ్రి,
బంగారు మెరుపుల్లో దగదాగా నా తండ్రి.
చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే,
కిల కిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే.
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (2)
పువ్వుల్లో నా తండ్రి, నవ్వుల్లో నా తండ్రి,
ఉపదేశం ఇచ్చేటి గురువుల్లో నా తండ్రి.
అగ్నిలో నా తండ్రి, పృథ్విలో నా తండ్రి,
గాలి ధూళిని తరిమే గణమైన నా తండ్రి.
చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే,
కిల కిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే.
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (2)
శ్రీకారం నా తండ్రి, ఓంకారం నా తండ్రి,
మంత్రతంత్రాలలో మా శక్తి నా తండ్రి.
చిగతిలో నా తండ్రి, ప్రగతిలో నా తండ్రి,
సిరిగల్ల నా తండ్రి, దయగల్ల నా తండ్రి.
చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే,
కిల కిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే.
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (2)
ప్రళయమే నా తండ్రి, నిలయమే నా తండ్రి,
దుష్టశక్తులు తరిమే రుద్రుడే నా తండ్రి.
శాంతుడే నా తండ్రి, కాంతుడే నా తండ్రి,
స్నేహాలను అందించే వీరుడే నా తండ్రి.
చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే,
కిల కిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే.
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (3) ❤