హర హర శంభో శంకరా
శివ శివ శంభో జటాధరాభుజగ భూషణ ఫాలనేత్ర
శూలధారీ మమ శరణం
పరమ శివా యని పాడేను నాగళం
ముక్కంటి దేవర మహేశ్వర
సృష్టి స్థితిలయ కారకా ఈశ
వేడెదరా నిను గంగాధరా భవ -2
చంద్ర శేఖరా చర్మాంబరుడా
పార్వతి నాథ కదలి రావయ
నీ పాదము సోకి పులకించే ఈ పుడమి
భస్మాంబరా ధారి జగదీశ్వర
కైలాస గిరివాసా పరమేశ్వరా శివ -2
నమో నమో నమః శివాయ
నీల కంటుడా నీలాంబరుడా
లింగ స్వరూపుడ మమ్ము బ్రోవరా